![]() |
![]() |

టాలీవుడ్ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన అసలుసిసలు మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి రూపొందించిన ఈ సినిమా మార్చి 25 న విడుదలై ఇప్పటిదాకా దాదాపు రూ.1100 కోట్ల గ్రాస్ రాబట్టి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా విడుదలకి ముందు నుంచీ ప్రత్యేకంగా నిలిచిన అంశం తారక్, చరణ్ ఫ్రెండ్ షిప్. ఈక్వల్ స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోలు ఇంత స్నేహంగా ఉండగలరా అని అందరూ ఆశ్చర్యపడేలా వీరి మధ్య దోస్తీ కుదిరింది. ఇక సినిమాలోనూ వారు పోషించిన పాత్రల మధ్య స్నేహాన్ని చూపించే 'దోస్తీ' సాంగ్ ఉంది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
నిప్పు లాంటి రామ్(చరణ్)కి, నీరు లాంటి భీమ్(తారక్)కి మధ్య ఏర్పడిన స్నేహాన్ని దోస్తీ సాంగ్ లో అద్భుతంగా చూపించారు. "పులికి విలుకాడికి.. తలకి ఉరితాడుకి.. కదిలే కార్చిచ్చుకి, కసిరే వడగళ్ళకి.. రవికి మేఘానికి దోస్తీ" అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన లిరిక్స్ ఈ పాటకి ప్రధాన నిలిచాయి. ఆ లిరిక్స్ కి తగ్గట్లే కీరవాణి మ్యూజిక్, రాజమౌళి మేకింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఓ వైపు ఇద్దరి మధ్య స్నేహాన్ని చూపిస్తూనే.. మరోవైపు ఇద్దరూ వారి వారి లక్ష్యాల కోసం ప్రయత్నిస్తుండటం చక్కగా చూపించారు. ఈ సాంగ్ కి కాలభైరవ వాయిస్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' నుంచి 'నాటు నాటు', 'కొమ్మా ఉయ్యాలా' వీడియో సాంగ్స్ విడుదలై అలరిస్తున్నాయి. తాజాగా విడుదలైన 'దోస్తీ' వీడియో సాంగ్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో విడుదలైన నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ రావడం విశేషం.
![]() |
![]() |