Home

»

Latest News

నిన్న పరిణితి చోప్రా.. నేడు ఆలియా భట్!?

Apr 21, 2022 5:22PM

క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌థానాయిక‌గా త‌న‌దైన ముద్ర వేసిన నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్న‌.. అతి త్వ‌ర‌లో బాలీవుడ్ లోనూ సంద‌డి చేయ‌బోతోంది. ఇప్ప‌టికే హిందీనాట రెండు చిత్రాలు  పూర్తిచేసిన ర‌ష్మిక‌.. ఆయా సినిమాల విడుద‌ల‌ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. అలాగే, ర‌ణ్ బీర్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా `అర్జున్ రెడ్డి`, `క‌బీర్ సింగ్` చిత్రాల ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ `యానిమ‌ల్`లోనూ హీరోయిన్ గా ఎంట‌ర్టైన్ చేయ‌నుంది ర‌ష్మిక‌.

ఇదిలా ఉంటే, ప్ర‌స్తుతం తెలుగులో `సీతారామం`, `పుష్ప - ద రూల్` చేస్తున్న ర‌ష్మిక‌.. తాజాగా ఓ భారీ బ‌డ్జెట్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఆ చిత్రం మ‌రేదో కాదు.. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, విజ‌న‌రీ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ సెకండ్ జాయింట్ వెంచ‌ర్. తొలుత ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ క‌న్ఫామ్ అయింది. అయితే, ఇటీవ‌లే ర‌ణ్ బీర్ క‌పూర్ ని పెళ్ళాడిన ఆలియా.. కొన్నాళ్ళు వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాల‌ని నిర్ణ‌యించుకుని తాజాగా `ఎన్టీఆర్ 30`ని సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట‌. దీంతో.. ఆ ఆఫ‌ర్ ర‌ష్మిక చెంత‌కు చేరింద‌ని బ‌జ్.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. నిన్న‌టికి నిన్న ర‌ణ్ బీర్ క‌పూర్ `యానిమ‌ల్`లో ప‌రిణీతి చోప్రా చేయాల్సిన పాత్ర‌ని చేజిక్కించుకున్న ర‌ష్మిక‌.. ఇప్పుడు ర‌ణ్ బీర్ శ్రీ‌మ‌తి ఆలియా వ‌ద్ద‌నుకున్న వేషంలో క‌నిపించ‌బోతోంద‌న్న‌మాట‌. మొత్తానికి.. ఒక‌రు వ‌ద్ద‌నుకున్న పాత్ర‌లకి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ టాక్ ఆఫ్ ఇండ‌స్ట్రీ అవుతోంది ర‌ష్మిక‌. కాగా,  త్వ‌ర‌లోనే `ఎన్టీఆర్ 30`లో ర‌ష్మిక ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com