![]() |
![]() |

తెలుగు రాష్ట్రాల్లో 'కేజీఎఫ్ చాప్టర్-2'కి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి వారం కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం టాప్-10 లో చోటు దక్కించుకున్న కేజీఎఫ్-2.. తెలంగాణ(నైజాం)లో అయితే ఏకంగా టాప్-3 లో నిలిచింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు 2.34 కోట్ల షేర్ రాబట్టిన కేజీఎఫ్-2 వారం రోజుల్లో 64.51 కోట్ల షేర్(102.60 కోట్ల గ్రాస్) రాబట్టింది. డబ్బింగ్ సినిమా వారం రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. 'ఆర్ఆర్ఆర్' మూవీ ఏపీ, తెలంగాణలో కలిపి మొదటి వారం 187.65 కోట్ల షేర్ తో టాప్ పొజిషన్ లో ఉండగా.. 64.51 కోట్లతో కేజీఎఫ్-2 తెలుగు స్టేట్స్ లో మొదటి వారం అత్యధిక షేర్ రాబట్టిన లిస్టులో పదో స్థానంలో నిలిచింది.
మొదటి వారంలో ఈ సినిమా తెలంగాణలో 33.43 కోట్లు, ఆంధ్రాలో 22.01 కోట్లు, రాయలసీమలో 9.07 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాంలో మొదటివారం అత్యధిక షేర్ రాబట్టిన సినిమాల లిస్టులో కేజీఎఫ్-2 మూడో స్థానం దక్కించుకుంది. 77.17 కోట్లతో 'ఆర్ఆర్ఆర్', 35.73 కోట్లతో 'బాహుబలి-2' మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
వరల్డ్ వైడ్ గా 345 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ వారం రోజుల్లో 357.01 కోట్ల షేర్(719.30 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసి ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఏడు రోజుల్లో కర్ణాటకలో 66.20 కోట్లు(100 కోట్లు బిజినెస్), తెలుగు రాష్ట్రాల్లో 64.51 కోట్లు(78 కోట్లు బిజినెస్), తమిళనాడు 23.15 కోట్లు(27 కోట్లు బిజినెస్), కేరళ 18.10 కోట్లు(10 కోట్లు బిజినెస్), హిందీ+రెస్టాఫ్ ఇండియా 128.60 కోట్లు(100 కోట్లు బిజినెస్), ఓవర్సీస్ 56.45 కోట్ల(30 కోట్లు బిజినెస్) షేర్ రాబట్టింది. ఇప్పటికే కేరళ, నార్త్, ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన కేజీఎఫ్-2 త్వరలోనే మిగతా చోట్లా ప్రాఫిట్స్ లోకి అడుగుపెట్టే అవకాశముంది.
![]() |
![]() |