![]() |
![]() |

స్టార్ హీరో సినిమా చిన్న హీరో సినిమా అనే తేడా లేకుండా ఒక్కోసారి మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ సినిమా పూర్తి అయితే మాత్రం పెద్ద హీరో సినిమా థియేటర్స్ లోకి రావడం ఈజీ. కానీ చిన్న సినిమాలు మాత్రం చాలా ఇబ్బందిని ఎదుర్కుంటాయి. సరైన రిలీజ్ డేట్, థియేటర్స్ దొరక్క లాబ్ లోనే ఉండిపోతున్నాయి. కానీ వాటన్నింటిని దాటుకుని ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు నేరుగా మీ ఇంట్లోకి రాబోతుంది
ఆరంభం..ఈ నెల 10 న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యింది.సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కగా తొలుత పర్వాలేదనే టాక్ ని సంపాదించుకుంది. రివ్యూస్ కూడా బాగానే వచ్చాయి. కానీ రన్నింగ్ లో మాత్రం ప్రేక్షకాదరణని పొందలేకపోయింది.బహుశా ప్రేక్షకులకి తెలిసిన నటులు లేకపోవడం కావచ్చు. ఇపుడు ఈ మూవీ థియేటర్స్ ని విడిచి ఓటిటి లోకి అడుగుపెట్టనుంది. మే 23 నుంచి తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఓటిటి లోకి రావడం విశేషం.

సుప్రీత సత్యనారాయణ్, మోహన్ భగత్, భూషన్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, భూషణ్, లక్ష్మణ్ మీసాల, బొడ్డేపల్లి అభిషేక్, సురభి ప్రభావతి ముఖ్య పాత్రల్లో కనిపించారు. అజయ్ నాగ్ దర్శకత్వం వహించగా అభిషేక్ వి తిరుమలేష్ నిర్మించారు. సింజిత్ యర్రమిల్లి సంగీతాన్ని దేవదేవ్ గాంధీ కెమెరామన్ గా వ్యవహరించాడు
![]() |
![]() |