![]() |
![]() |
.webp)
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసి విభీమన్నమైన నటనతో ప్రేక్షకాదరణని పొందిన హీరో ఆనంద్ దేవరకొండ. బేబీ తో మంచి విజయాన్ని అందుకొని ప్రస్తుతం గం గం గణేశా అంటున్నాడు. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అతిధులు చెప్పిన విషయాలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి
ప్రముఖ అగ్ర రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపల్లి గం గం గణేశా ట్రైలర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతు చిత్ర దర్శకుడు ఉదయ్ తన దగ్గర పని చేసాడని. అంకిత భావం కష్టపడేతత్వం ఉన్నవాడు. మూవీ తప్పకుండా విజయం సాదిస్తుందని చెప్పాడు. అనంతరం వంశీ మాట్లాడుతు బేబీ ట్రైలర్ జులై లో విడుదల చేసాం.అప్పుడు వర్షం పడింది. మూవీ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు గం గం గణేశా ట్రైలర్ మే లో విడుదల చేసాం.ఇప్పుడు వర్షం పడుతుంది. కాబట్టి బేబీ లాగే సూపర్ హిట్ అవుతుందని చెప్పాడు. అత్యాశ,భయం,కుట్ర అనే అంశాల చుట్టూ అల్లుకున్న క్రైమ్ కామెడి కథ అని ఆనంద్ దేవరకొండ చెప్పాడు. ఇండస్ట్రీ లో ఎవరైనా ఏదైనా సాధిస్తే కొంత మంది మాత్రమే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో మార్పు రావాలి.అందరం కలిసి సెలెబ్రేట్ చేసుకొవాలి అని కూడా చెప్పాడు

తెలుగు వారి అభిమాన పండుగ వినాయక చవితి బ్యాక్ డ్రాప్ లో మూవీ తెరకెక్కింది. ప్రగతి శ్రీ వాత్సవ, నయన్ సారిక లు హీరోయిన్లుగా చేస్తుండగా కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ బొమ్మి శెట్టి దర్శకుడు. మే 31 న విడుదల అవుతుంది, చైత్యన్య భరద్వాజ్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ట్రైలర్ కూడా సూపర్ గా ఉంది
![]() |
![]() |