![]() |
![]() |

కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ వస్తున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda). త్వరలో ఆనంద్ "గం..గం..గణేశా" (Gam Gam Ganesha) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమా కోసం తన లుక్ కూడా మార్చేశాడు. ఆయన ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు. తాజాగా తన సిక్స్ ప్యాక్ ఫొటోను ఆనంద్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆనంద్ సిక్స్ ప్యాక్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతని చేంజోవర్ చూసి అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. డెడికేషన్ అదిరిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా 'లైగర్' కోసం తన అన్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా సిక్స్ ప్యాక్ చేశాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆనంద్ "గం..గం..గణేశా"తో ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడేమో చూడాలి. తాజాగా విడుదలైన ట్రైలర్ కి అయితే మంచి స్పందనే వచ్చింది.
"గం..గం..గణేశా" యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా ఈ నెల 31న థియేటర్స్ లోకి రాబోతోంది. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
![]() |
![]() |