![]() |
![]() |
.webp)
కేజిఎఫ్ తో యష్(yash)ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. నేడు ఇండియా మొత్తం ఆయన కొత్త సినిమా కోసం ఎదురుచూస్తు ఉంది. ఎట్ లీస్ట్ ఆయన మూవీ షూటింగ్ జరుపుకుంటున్నా చాలు ఫ్యాన్స్ కీ పండుగే. రీసెంట్ గా ఆయన రెండు చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, అందులో ఒకటి టాక్సిక్ కాగా ఇంకోటి రామాయణ(ramayana) ఈ రెండు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో యష్ కి సంబంధించిన ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది.
రామాయణ.. భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుని జీవిత కథ ఆధారంగా ఇతిహాసాల్లో పొందుపరిచిన రామాయణం ని ప్రధాన ఇతి వృత్తంగా చేసుకొని తెరకెక్కుతుంది. రాముడు గా రణబీర్ కపూర్ (ranbir kapoor) సీతమ్మ తల్లిగా సాయి పల్లవి (sai pallavi) చేస్తుంది. ఇక యష్ రావణుడుగా మెరవబోతున్నాడు.పరమేశ్వరుడు కి పరమ భక్తుడైన రావణుడు లంకకి అధిపతి. లంక మొత్తం సువర్ణమయం.ఆయన ఒంటి మొత్తం ఎప్పుడు బంగారంతో నిండిపోయి ఉంటుంది.ధరించే వస్త్రాలు, వాడే వస్తువులు అన్ని పూర్తిగా సువర్ణమయం. అంటే బంగారంతో చేసిన వాటినే రావణ బ్రహ్మ ఉపయోగించేవాడు. ఈ విషయం గురించి పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. ఇప్పుడు రావణుడుగా చేస్తున్న యష్ కి కూడా నిజమైన బంగారాన్నే వాడబోతున్నారు. అంటే రావణుడి లా యష్ ఒంటి నిండా మాత్రమే కాకుండా వాడబోయే వస్తువులు కూడా బంగారం తోనే ఉండబోతున్నాయి

అదే విధంగా ఇంతవరకు ఏ మూవీలోను లంక ని ఎవరు చూపించని విధంగా భారీ సెట్స్ వేస్తున్నారు. నితీష్ తివారి దర్శకుడు కాగా ప్రొడ్యూసర్స్ విషయంలో చిన్న గందర గోళం నెలకొని ఉంది. కేజిఎఫ్ లో యష్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో దోచుకున్న బంగారాన్ని ఈ సినిమాకి ఉపయోగిస్తున్నాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా యష్ గోల్డ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
![]() |
![]() |