![]() |
![]() |

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ విజయపథంలో పయనించాయి. వాటిలో `బాద్ షా` ఒకటి. `దూకుడు` (2011) వంటి సెన్సేషనల్ హిట్ తరువాత అగ్ర దర్శకుడు శ్రీను వైట్ల రూపొందించిన ఈ చిత్రంలో `బాద్ షా`గా టైటిల్ రోల్ లో తనదైన అభినయంతో మెప్పించాడు తారక్. అలాగే పోలీసాఫీసర్ గానూ కనిపించి అలరించాడు. సిద్ధార్థ్ (అతిథి పాత్ర), నవదీప్, సుహాసిని, రీతూ వర్మ, బ్రహ్మానందం, నాజర్, ఆశిష్ విద్యార్ధి, ప్రదీప్ రావత్, ముకేశ్ రిషి, నాగబాబు, సాయాజీ షిండే, విక్రమ్ జీత్ విర్క్, సుప్రీత్, చంద్రమోహన్, ఆదిత్య మీనన్, జయ ప్రకాశ్ రెడ్డి, మాస్టర్ భరత్, వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి, సురేఖా వాణి, ప్రగతి, సుధ, రవిప్రకాశ్, బ్రహ్మాజీ, సత్యకృష్ణన్, ఎమ్మెస్ నారాయణ, అజయ్, షఫి, సత్యం రాజేశ్, పృథ్వీరాజ్ తదితరులు ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకోగా.. మీనాక్షి దీక్షిత్ టైటిల్ సాంగ్ లో ఎంటర్టైన్ చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు అందించిన వాయిస్ ఓవర్ `బాద్ షా`కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
యువ సంగీత సంచలనం తమన్ పాటలు, నేపథ్య సంగీతం `బాద్ షా`కి ప్రధాన బలంగా నిలిచాయి. టైటిల్ సాంగ్ తో పాటు ``బంతిపూల జానకి``, ``డైమండ్ గాళ్``, ``సైరో సైరో``, ``వెల్ కమ్ కనకమ్``, ``రంగోళి రంగోళి``.. ఇలా ఇందులోని గీతాలన్ని రంజింపజేశాయి. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మించిన `బాద్ షా`.. 2013 ఏప్రిల్ 5న విడుదలై విజయం సాధించింది. నేటితో ఈ యాక్షన్ కామెడీ డ్రామా.. 9 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |