![]() |
![]() |

కింగ్ నాగార్జున కెరీర్ లో పలు మ్యూజికల్ సెన్సేషన్స్ ఉన్నాయి. వాటిలో `నువ్వు వస్తావని` ఒకటి. తమిళ చిత్రం `తుళ్ళాద మనముమ్ తుళ్ళుమ్` (విజయ్, సిమ్రాన్) ఆధారంగా రూపొందిన ఈ సినిమా ద్వారా వి.ఆర్. ప్రతాప్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మాతృకలో కథానాయికగా నటించిన సిమ్రాన్ ఇందులోనూ హీరోయిన్ గా నటించగా.. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, అలీ, సుధాకర్, మల్లికార్జున రావు, సూర్య, శివాజీ రాజా, వర్ష, రమాప్రభ, వై. విజయ, సుధ, నూతన్ ప్రసాద్, ప్రసాద్ బాబు, రఘు కుంచె, బండ్ల గణేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. ఈ చిత్రానికి మరుధూరి రాజా సంభాషణలు సమకూర్చారు.
మెలోడీ స్పెషలిస్ట్ ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతసారథ్యంలో రూపొందిన గీతాలన్ని విశేషాదరణ పొందాయి. ``పాటల పల్లకివై`` (మూడు వెర్షన్స్), ``కలలోనైనా కలగనలేదే``, ``కొమ్మా కొమ్మా``, ``మేఘమై నేను వచ్చాను``, ``రైలు బండిని నడిపేది``, ``నీవే దేవునివి``.. ఇలా ఇందులోని ప్రతీ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్. బి. చౌదరి నిర్మించిన `నువ్వు వస్తావని`.. 2000 ఏప్రిల్ 5న విడుదలై పలు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. నేటితో ఈ మ్యూజికల్ సెన్సేషన్ 22 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |