![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని అటు మాస్ ఆడియన్స్ కి, ఇటు కుటుంబ ప్రేక్షకులకి మరింత చేరువ చేసిన చిత్రం మిర్చి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాతోనే దర్శకుడిగా తొలి అడుగేశారు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రంతోనే నిర్మాణరంగంలోకి ప్రవేశించడం విశేషం. ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ నటించిన ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్రలో దర్శనమిచ్చారు. ఈ చిత్రంతోనే నాటి అందాలనటి నదియా తెలుగునాట రి-ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ తల్లి పాత్రలో నటించి మెప్పించారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. అలాగే ప్రేక్షకుల రివార్డులు, రికార్డులతో పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకుందీ సినిమా. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నూతన దర్శకుడు, ఉత్తమ ప్రతినాయకుడు (సంపత్ రాజ్), ఉత్తమ కళా దర్శకుడు (ఎ.ఎస్. ప్రకాశ్), ఉత్తమ నేపథ్య గాయకుడు (కైలాష్ ఖేర్).. ఇలా ఆరు విభాగాల్లో నంది పురస్కారాలు దక్కాయి. కన్నడలో మాణిక్య పేరుతో, బెంగాలీలో బిందాస్ టైటిల్ తో, ఒడియాలో బిశ్వనాథ్ పేరుతో ఈ సినిమాని రీమేక్ చేశారు. 2013 ఫిబ్రవరి 8న విడుదలై ఘనవిజయం సాధించిన మిర్చి.. నేటితో 8 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |