![]() |
![]() |

డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి కాంబినేషన్ లో నందమూరి కథానాయకుడు కళ్యాణ్ రామ్ ఓ భారీ బడ్జెట్ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. కేథరిన్ ట్రెసా ఓ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా సంయుక్తా మీనన్ ఎంపికైంది. తెలుగులో సంయుక్తకి ఇదే మొదటి సినిమా అయినా.. మలయాళం, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన అనుభవం సంయుక్తకి ఉంది.
కాగా అటు గ్లామర్ కి, ఇటు పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది సంయుక్త. ఇంకా పేరు నిర్ణయించని ఈ క్రేజీ ప్రాజెక్ట్ తాలూకు షూటింగ్ లో ప్రస్తుతం సంయుక్త బిజీగా ఉంది. మరి.. ఈ సినిమా తరువాత సంయుక్త తెలుగులో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. 'గాలిపట 2' సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోనూ తొలి అడుగు వేస్తోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. తెలుగు, కన్నడ డెబ్యూ మూవీస్ సంయుక్తకి ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి మరి.
![]() |
![]() |