![]() |
![]() |

మొఘలాయిల పరిపాలనా కాలం నాటి వాతావరణం నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ పిరియడ్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో పవన్ కి జోడీగా నిధి అగర్వాల్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని అగ్ర నిర్మాత ఎ.ఎం. రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్.. ఆఖరి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో దర్శనమివ్వనున్నారని సమాచారం. ఈ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్. త్వరలోనే అర్జున్ రామ్ పాల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, 2022 సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేసే దిశగా పవన్ - క్రిష్ పిరియడ్ డ్రామా నిర్మాణం జరుపుకుంటోందని వినికిడి.
![]() |
![]() |