![]() |
![]() |

తమిళ స్టార్ హీరో సూర్య కొవిడ్ 19 బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. "నేను కొవిడ్-19కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాను, ప్రస్తుతం మెరుగవుతున్నాను. లైఫ్ ఇంకా సాధారణ స్థితికి రాలేదని మనమందరం గ్రహించాలి. మనం కూడా జీవితాన్ని భయంతో కొనసాగించకూడదు. మనం మరింత శ్రద్ధగా, క్షేమంగా ఉండాలి. నా వైపు నిల్చొని అంకితభావంతో పనిచేస్తున్న డాక్టర్లు, మెడికల్ సిబ్బందికి ప్రేమనీ, కృతజ్ఞతనీ తెలియజేస్తున్నాను." అని ఆయన ట్వీట్ చేశారు.
దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్యకు కరోనా వైరస్ సోకిందనే వార్తతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన కొవిడ్ నుంచి వేగంగా కోలుకోవాలని వేలాదిగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
సూర్య సన్నిహితుడు రాజశేఖర్ పాండ్యన్ సైతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న ఆందోళనలను తొలగించడానికి ట్విట్టర్ సాయం తీసుకున్నారు. "డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సూర్య అన్న బాగానే ఉన్నారు, ఆందోళన చెందాల్సిన పనిలేదు." అని ఆయన ట్వీట్ చేశారు.
సూర్య చివరిసారిగా 'ఆకాశం నీ హద్దురా' ('సూరారై పొట్రు'కు తెలుగు వెర్షన్) సినిమాలో కనిపించి, తన సూపర్బ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆ మూవీ గత నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలైంది.
![]() |
![]() |