![]() |
![]() |

మెగా కాంపౌండ్‌కి అచ్చొచ్చిన దర్శకుల్లో వీవీ వినాయక్ ఒకరు. మరీ ముఖ్యంగా.. మెగాస్టార్ చిరంజీవితో వినయ్ చేసిన రెండు సినిమాలు (ఠాగూర్, ఖైదీ నంబర్ 150) కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అంతేకాదు.. ఆ రెండు సినిమాల్లోనూ చిన్న పాత్రల్లో కనిపించి అలరించారు.
కట్ చేస్తే.. మరోమారు మెగా కాంపౌండ్ మూవీలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనున్నారు వినయ్. అయితే.. ఈ సారి తను డైరెక్ట్ చేసే సినిమాలో కాకుండా వేరే దర్శకుడు టేకప్ చేస్తున్న మూవీలో ఈ స్టార్ కెప్టెన్ తళుక్కున మెరవనున్నారు. అది కూడా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం.
ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఆధారంగా పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ మల్టిస్టారర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ అతిథి పాత్ర కోసం వినాయక్ నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. అల్యూమినియం ఫ్యాక్టరీలో తన పాత్ర తాలూకు షూటింగ్ కూడా జరిగిందని వినికిడి. మరి.. అన్నయ్య చిరుకి అచ్చొచ్చిన వినాయక్ గెస్ట్ ఫ్యాక్టర్.. తమ్ముడు పవన్‌కి కూడా కలిసొస్తుందేమో చూడాలి.
![]() |
![]() |