![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'సర్కారు వారి పాట' షూటింగ్ పూర్తి చేసుకుంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో కీర్తి సురేశ్ హీరోయిన్. తమన్ సంగీతం సమకూర్చిన టైటిల్ సాంగ్‌ను శనివారం రిలీజ్ చేశారు. "సరా సరా సర్కారువారి పాట" అంటూ సాగే ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా, హారిక నారాయణ్ ఆలపించింది. బ్యాగ్రౌండ్ సాంగ్‌గా ఇది వస్తుందని తెలుస్తోంది. తమన్ తనదైన శైలిలో ఫాస్ట్ పేస్డ్ బీట్ తో ఈ టైటిల్ సాంగ్‌కు ట్యూన్స్ ఇచ్చాడు. పాట మొదలైనప్పటి నుంచి చివరి వరకూ ఎనర్జిటిక్‌గా, ఎంగేజింగ్‌గా ఉంది.
సినిమాలో మహేశ్‌బాబు పాత్రని వర్ణించే పాట ఇది. ''ఆయుధాలు లేని వేట, రివర్స్ లేని బాట'' అనే మాటలు మహేశ్ పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాయి. హారిక హై పిచ్ లో పాడిన విధానం టైటిల్ సాంగ్‌కు సరిగ్గా సరిపోయింది. ఈ పాటలో మహేశ్ పూర్తిగా యాక్షన్ లుక్స్ లో కనిపించి అలరించాడు. మొదటి రెండు పాటల్లాగే ఈ టైటిల్ ట్రాక్ కూడా చార్ట్ బస్టర్ లిస్టులో చేరింది.
యాక్షన్ ఎంటర్‌టైనర్ అయిన 'సర్కారువారి పాట'ను మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆర్. మది సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా, ఎ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. 'సర్కారు వారి పాట' మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

![]() |
![]() |