![]() |
![]() |

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించిన చిన్న చిత్రాల్లో `ఆర్ ఎక్స్ 100`కి ప్రత్యేక స్థానం ఉంది. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ ని ఓవర్ నైట్ స్టార్స్ ని చేసేసింది. మరీముఖ్యంగా.. పాయల్ గ్లామర్, క్యారెక్టరైజేషన్ యూత్ ని పదే పదే థియేటర్ల వైపు పరుగులు తీయించింది. తన శారీరక వాంఛలు తీర్చుకోవడానికి.. ప్రేమ పేరుతో శివ (కార్తికేయ) అనే యువకుడిని ఇందు (పాయల్) ఎలా మోసం చేసింది? చివరకి వీరి కథ ఎలాంటి తీరాలకు చేరింది? అనేదే `ఆర్ ఎక్స్ 100` స్టోరీలైన్. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు అజయ్ భూపతి ఈ రొమాంటిక్ డ్రామాని జనరంజకంగా తీర్చిదిద్దారు.
ఇక ఛైతన్ భరద్వాజ్ అందించిన పాటలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. పాటల్లో ``పిల్లా రా`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``మనసును పట్టి``, `రెప్పలనిండా``, ``అదిరే హృదయం``, ``రుధిరం మరిగి``, ``నిప్పై రగిలే`` కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో `తడప్` పేరుతోనూ, కన్నడంలో `శివ 143` టైటిల్ తోనూ రీమేక్ అవుతోంది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన `ఆర్ ఎక్స్ 100`.. 2018 జూలై 12న జనం ముందుకు వచ్చింది. నేటితో ఈ సెన్సేషనల్ హిట్ మూడు వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |