![]() |
![]() |

`పందెం కోడి` ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ ఊరమాస్ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది.
ఇదిలా ఉంటే.. `ఉస్తాద్` అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా కోసం రామ్ రెండు ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. కథానుసారం అటు డాక్టర్ గానూ.. ఇటు పోలీస్ గానూ డ్యూయెల్ షేడ్స్ ఉన్న రోల్ లో ఎంటర్టైన్ చేయబోతున్నాడట రాపో. రోగులకు వైద్యం చేసే వైద్యుడు.. రక్షక భటుడిగా మారి సమాజానికి పట్టిన చీడను ఎలా సరిచేశాడు? అనేదే ఈ సినిమా స్టోరీలైన్ అని టాక్. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఈ చిత్రంలో రామ్ కి జంటగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్.. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |