![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ మల్టిస్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్. వివరాల్లోకి వెళితే.. బాలయ్యతో ఆదిత్య 369, వంశానికొక్కడు వంటి బ్లాక్ బస్టర్స్ తో పాటు భలేవాడివి
బాసూ, మిత్రుడు వంటి సినిమాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ లాంగ్ గ్యాప్ తరువాత మరోమారు జట్టుకట్టనున్నారట. ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ
సినిమాలో బాలయ్యతో పాటు యువ కథానాయకుడు నాగశౌర్య కూడా నటించబోతున్నారని సమాచారం.
అంతేకాదు.. ఇందులో బాలకృష్ణ చాలా శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని వినిపిస్తోంది. బోయపాటి శ్రీను డైరెక్టోరియల్ తరువాత బాలయ్య నటించే సినిమా ఇదే కావచ్చని టాక్. త్వరలోనే బాలకృష్ణ, నాగశౌర్య
మూవీకి సంబంధించి మరింత క్లారిటీ రావచ్చు. మరి.. ఈ చిత్రంతోనైనా బాలయ్య - శివలెంక కృష్ణ ప్రసాద్ కాంబినేషన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.
![]() |
![]() |