![]() |
![]() |

బిగ్ బాస్ రియాలిటీ షోలో గ్లామర్ తక్కువ అయిందనే మాటలు కామెంట్లు అక్కడక్కడా వినపడుతున్నాయి. త్వరలో గ్లామర్ భామను షోలోకి ప్రవేశపెట్టడానికి నిర్వాహకులు సంసిద్ధం అయ్యారు. అల్లరి నరేష్ సరసన 'జంప్ జిలాని' సినిమాలో ఓ కథానాయికగా నటించిన తెలుగమ్మాయి స్వాతి దీక్షిత్ త్వరలో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టనుంది.
ప్రస్తుతం స్వాతి దీక్షిత్ క్వారంటైన్ లో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వీకెండ్ లేదా వచ్చే వారంలో ఆమె హౌస్ లో అడుగు పెట్టడం ఖాయమే. ఆల్రెడీ హౌస్ లో ఎంటర్ అయిన కంటెస్టెంట్లపై విమర్శలు వ్యక్తమవడంతో వీలైనంత త్వరగా గ్లామర్ యాడ్ చేయాలని భావిస్తున్నారట. స్వాతి దీక్షిత్ కూడా అంత పెద్ద పేరున్న స్టార్ ఏమి కాదు. కాకపోతే గ్లామర్ గా ఉంటుందని పంపిస్తున్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ల కోసం స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీల వైపు చూస్తున్నారట. షో టిఆర్పి పెంచడమే లక్ష్యంగా బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త ప్రణాళికలు రచించుకుంటున్నారు.
![]() |
![]() |