![]() |
![]() |

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'దర్జా'. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు విడుదల చేశారు.
ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. "దర్జా టీజర్ బాగుంది. ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని అనిపిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని తెలిపారు.

ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ.. "మా టీజర్ ను రిలీజ్ చేసిన సురేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి థాంక్స్ తెలుపుకుంటున్నాను" అన్నారు.

సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, షకలక శంకర్, ఛత్రపతి శేఖర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి రాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్నాడు. దర్శన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.
ఇటీవల 'పుష్ప' సినిమాలో భార్యాభర్తలుగా కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, సునీల్ ఈ సినిమాలో ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.
![]() |
![]() |