![]() |
![]() |

వర్కింగ్ డేస్ లోనూ 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఐదోరోజు(మంగళవారం) 31 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఆర్ఆర్ఆర్ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350 కోట్ల షేర్, 625 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. ఇదే జోరు కొనసాగితే మరో వారం రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటే అవకాశముంది.
ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు 13.63 షేర్ రాబట్టింది. దీంతో ఐదోరోజు కలెక్షన్ల పరంగా ఇప్పటిదాకా టాప్ లో 'అల వైకుంఠపురములో' పేరిట ఉన్న 11.43 కోట్ల రికార్డు బ్రేక్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 74.11 కోట్ల షేర్ వసూలు చేసిన ఆర్ఆర్ఆర్.. రెండో రోజు 31.63 కోట్లు, మూడో రోజు 33.53 కోట్లు, నాలుగో రోజు 17.73 కోట్లు, ఐదో రోజు 13.63 కోట్లతో ఇప్పటిదాకా 170.63 కోట్ల షేర్ రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.191 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన 'ఆర్ఆర్ఆర్'.. ఐదు రోజులకే 89 శాతం రికవరీ సాధించింది. నైజాంలో 70 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ ఐదో రోజు వచ్చిన 6.70 కోట్లతో కలిపి ఇప్పటిదాకా 68.35 కోట్లు రాబట్టింది. రేపు నైజాంలో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటే అవకాశముంది. అలాగే సీడెడ్ లో 34.18 కోట్లు(బిజినెస్ 37 కోట్లు), ఆంధ్రాలో 68.10 కోట్లు(బిజినెస్ 84 కోట్లు)తో సత్తా చాటింది. మరో మూడు నాలుగు రోజుల్లో ఏపీలో కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటే అవకాశముంది.
వరల్డ్ వైడ్ గా ఐదో రోజు 31.13 కోట్ల షేర్ రాబట్టిన ఆర్ఆర్ఆర్ 350 కోట్ల షేర్ కి చేరువైంది. మొదటిరోజు 135 కోట్లు, రెండో రోజు 67.44 కోట్లు, మూడో 78.73 కోట్లు, నాలుగో రోజు 35.88 కోట్లు, ఐదో రోజు 31.13 కోట్లతో వరల్డ్ వైడ్ గా ఐదు రోజుల్లో 348.18 కోట్ల షేర్(625 కోట్ల గ్రాస్)తో సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ లో 67.60 కోట్లు, హిందీ 53.30 కోట్లు, కర్ణాటక 24.85 కోట్లు, తమిళనాడు 21.80 కోట్లు, కేరళ 5.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 4.65 కోట్లతో అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఆర్ఆర్ఆర్ మరో 104.82 కోట్లు రాబడితే క్లీన్ హిట్ గా నిలవనుంది. ఇదే జోరు కొనసాగితే మరో నాలుగైదు రోజుల్లో ఆర్ఆర్ఆర్ బయ్యర్లు లాభాలు చూడనున్నారు.
![]() |
![]() |