![]() |
![]() |

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ' సినిమా 2014 అక్టోబర్ లో విడుదలై ఘన విజయం సాధించింది. యానిమల్ హిప్నటిజం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో 'కార్తికేయ-2' రాబోతున్న సంగతి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది.
నేడు(జూన్ 1) నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా 'కార్తికేయ-2' ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది మూవీ టీమ్. ఇప్పటికే విడుదలైన ప్రీలుక్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. సముద్రంలో బోట్ పై వెళ్తున్న నిఖిల్, అనుపమ, శ్రీనివాస్ రెడ్డి దేనినో ఆశ్చర్యంగా చూస్తూ కనిపిస్తున్నారు. అలాగే ఆకాశంలో నెమలి పించెం ఆకారం నుంచి మెరుపులు, చుట్టూ పక్షులతో పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్ చూస్తుంటే 'కార్తికేయ'ని మించి 'కార్తికేయ-2' ఉండబోతుందని అనిపిస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. జూలై 22న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |