![]() |
![]() |

సముద్రఖని మంచి దర్శకుడు మాత్రమే కాదు.. మంచి నటుడు కూడా. స్వతహాగా తమిళయన్ అయిన సముద్రఖని.. తెలుగునాట `అల వైకుంఠపురములో`, `క్రాక్`, `భీమ్లా నాయక్`, `ఆర్ ఆర్ ఆర్` వంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ లో యాక్టర్ గా తనదైన ముద్ర వేశాడు.
ఇదిలా ఉంటే, ఈ వారం సముద్రఖనికి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన రెండు ఆసక్తికరమైన చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట సందడి చేయనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన `సర్కారు వారి పాట`లో సముద్రఖని విలన్ గా నటించాడు. రేపు (మే 12) ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రానుంది. అలాగే, కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ నటించిన `డాన్`లోనూ సముద్రఖని ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమా మే 13న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. మరి.. రెండు వరుస రోజుల్లో వస్తున్న ఈ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ తో సముద్రఖని నటుడిగా ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి. కాగా, `సర్కారు వారి పాట`కి పరశురామ్ దర్శకత్వం వహించగా.. `డాన్`ని శిబి చక్రవర్తి తెరకెక్కించాడు.
![]() |
![]() |