![]() |
![]() |

2020 జనవరిలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు రెండేళ్ల తర్వాత 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రేపు(మే 12న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిజల్ట్.. అయితే 'దూకుడు' లేదా 'ఆగడు' అయ్యే అవకాశముంది అంటూ చర్చ నడుస్తోంది.
'సర్కారు వారి పాట'ను ఎక్కువగా అందరూ 'పోకిరి'తో పోలుస్తున్నారు. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తే 'పోకిరి' కంటే 'దూకుడు' పోలికలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. పోకిరిలో హీరో క్యారెక్టర్ కి యాటిట్యూడ్ తో పాటు కాస్త వెటకారం ఉంటుంది. అయితే 'దూకుడు'లో హీరో సరదాగా ఉంటూ, హీరోయిన్ వెంటపడుతూ పంచ్ లు వేస్తూ చాలా వెటకారంగా ఉంటాడు. 'సర్కారు వారి పాట' ట్రైలర్ లో కూడా మహేష్ బాడీ ల్యాంగ్వేజ్, కామెడీ డైలాగ్స్ అదే స్టైల్ లో ఉన్నాయి. రీసెంట్ గా మహేష్ సైతం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. దూకుడులో హీరో-హీరోయిన్ ట్రాక్ కోసం ఎలా అయితే రిపీటెడ్ ఆడియన్స్ వచ్చారో ఈ సినిమాలో హీరో-హీరోయిన్ ట్రాక్ కోసం అలాగే వస్తారని అన్నాడు.
శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన 'దూకుడు' మూవీ 2011 లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో 'సర్కారు వారి పాట' కూడా అదే రేంజ్ లో భారీ విజయాన్ని అందుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదే కొందరు మాత్రం 'ఆగడు' రిజల్ట్ తో ఆందోళన చెందుతున్నారు. శ్రీను వైట్ల-మహేష్ కాంబినేషన్ లో వచ్చిన మరో మూవీ 'ఆగడు'లో కూడా మహేష్ ఇదే స్టైల్ లో కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. కానీ ఆ సినిమా చేదు ఫలితాన్ని ఇచ్చింది. దీంతో ఈ సినిమా మరో 'దూకుడు' అవుతుందో లేక మరో 'ఆగడు' అవుతుందో అని ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది.
అయితే 'సర్కారు వారి పాట' ట్రైలర్ కి వచ్చిన సూపర్ రెస్పాన్స్ ని బట్టి చూస్తే 'దూకుడు'లా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా మహేష్ గత మూడు చిత్రాలు 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' హిట్ కావడంతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు. మరి 'సర్కారు వారి పాట'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |