![]() |
![]() |
నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'వరుడు కావలెను'. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడు దసరా రేస్ నుంచి 'వరుడు కావలెను' తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ దసరా సీజన్ లో పలు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అక్టోబర్ 14న 'మహాసముద్రం', అక్టోబర్ 15న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', పెళ్లిసందD సినిమాలు విడుదల కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్స్ కి వస్తుండటం.. మరోవైపు పలు సినిమాలు ఒకే సమయంలో విడుదల అవుతుండటంతో.. 'వరుడు కావలెను' వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను నవంబర్ మొదటివారంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఎందుకంటే నాగశౌర్య నటించిన మరో మూవీ 'లక్ష్య' ను నవంబర్ 12 విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఒకవేళ 'వరుడు కావలెను' మూవీని నవంబర్ మొదటివారంలో విడుదల చేస్తే.. నాగశౌర్య రెండు సినిమాలు వారం గ్యాప్ తో విడుదల అయినట్లు అవుతుంది. మరి 'వరుడు కావలెను' మూవీ నిజంగానే వాయిదా పడుతుందో లేక దసరాకే విడుదలవుతుందో చూడాలి.
![]() |
![]() |