![]() |
![]() |
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో 'దేవ కట్టా' ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా తక్కువ సినిమాలతోనే దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా 'రిపబ్లిక్' అనే సినిమా తీసి ప్రశంసలు అందుకున్న ఆయన.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారని ప్రచారం జరుగుతోంది.
'వెన్నెల' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన దేవ కట్టా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించారు. ఇక రెండో సినిమా 'ప్రస్థానం'తో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, డైనమైట్, ప్రస్థానం హిందీ రీమేక్ చేసిన ఆయన.. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'రిపబ్లిక్' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. పదునైన మాటలు రాయడంలో దిట్ట అయిన దేవ కట్టా రిపబ్లిక్ మూవీతో మరోసారి తన కలం బలం చూపారు. అయితే ఇటీవల రిపబ్లిక్ మూవీని చూసి దేవ కట్టా ప్రతిభను మెచ్చిన పవన్.. తన కోసం ఒక స్టొరీ రెడీ చేయమన్నారట. ప్రస్తుతం దేవ కట్టా అదే పనిలో టాక్.
ప్రస్తుతం పవన్ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తున్నారు. వీటితో పాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత దేవ కట్టాతో సినిమా ఉండే అవకాశముంది. పొలిటికల్ డ్రామాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ రాయడంలో సిద్ధహస్తుడైన దేవ కట్టా.. పవన్ కోసం ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేస్తారో చూడాలి.
![]() |
![]() |