![]() |
![]() |
మిల్కిబ్యూటీ తమన్నా తెలుగు, తమిళ్ తో పాటు పలు భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎందరో స్టార్ హీరోల సరసన నటించి వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి తమన్నాకు బుల్లితెరపై ఊహించని షాక్ తగిలింది.
తమన్నా 'మాస్టర్ చెఫ్' టీవీ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వెండితెరపై తమన్నాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ఆమెకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి, షోని భారీగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. అయితే, షోకి ప్రేక్షకుల నుండి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. రాబడి కంటే ఖర్చు ఎక్కువ అవుతున్నట్లు భావించిన నిర్వహకులు.. ఖర్చు తగ్గించుకొని సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగా తమన్నాను తప్పించి.. ఆమె స్థానంలో యాంకర్ అనసూయను తీసుకోబోతున్నారట.
చిన్న చిన్న మార్పులతో అనసూయ హోస్ట్ గా 'మాస్టర్ చెఫ్' త్వరలోనే సరికొత్తగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. మరి అనసూయ రాక షోకి ఏమైనా ప్లస్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |