![]() |
![]() |
టాలీవుడ్ స్టార్స్ హోస్ట్ అవతారం ఎత్తుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ టీవీ, ఓటీటీల వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆ లిస్టులో నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా చేరనున్నారని టాక్ వినిపిస్తోంది.
ప్రముఖ ఓటీటీ వేదిక 'ఆహా' పలు షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆహా బాలకృష్ణతో ఒక టాక్ షోని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షో విషయమై ఇటీవల ఆహా బాలకృష్ణను సంప్రదించగా.. షో కాన్సెప్ట్ బాగా నచ్చడంతో హోస్ట్ గా చేయడానికి బాలయ్య ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుందని టాక్.
కాగా బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' మూవీ చేస్తున్నాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ.
![]() |
![]() |