![]() |
![]() |
కరోనా కాలంలో ఎన్నో భారీ సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలా వాయిదా పడిన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమాను.. క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే ఈ ఏడాది క్రిస్మస్ పోరు 'ఆచార్య' వర్సెస్ 'పుష్ప' గా మారనుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'పుష్ప'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప.. రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగాన్ని క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు మెగాస్టార్ 'ఆచార్య' చిత్రాన్ని కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
వచ్చే సంక్రాంతి బరిలో ప్రభాస్ 'రాధే శ్యామ్', మహేష్ బాబు 'సర్కారు వారి పాట', పవన్ కళ్యాణ్ - రానాల 'భీమ్లా నాయక్' సినిమాలు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్-రామ్ చరణ్ ల 'ఆర్ఆర్ఆర్' కూడా సంక్రాంతి బరిలో దిగబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఆచార్య' చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కు విడుదల చేస్తే మంచిదన్న ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారట. మరి ఈ ఏడాది క్రిస్మస్ కి మెగాస్టార్ వర్సెస్ ఐకాన్ స్టార్ పోరు ఉంటుందేమో చూడాలి.
![]() |
![]() |