కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని విలన్ గా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
విజయ్ ప్రస్తుతం 'బీస్ట్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాని విలన్ పాత్ర చేయబోతున్నాడట. ఇప్పటికే 'జెంటిల్ మేన్', 'V' సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించాడు నాని. ఇప్పుడు పూర్తిగా విలన్ పాత్ర చేసేందుకు సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది.
నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల 'టక్ జగదీష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. ప్రస్తుతం 'శ్యామ్ సింగరాయ్', 'అంటే సుందరానికి' వంటి సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు ఓ నూతన దర్శకుడితోనూ సినిమా చేయనున్నాడు. మరి హీరోగా ఇంత బిజీగా ఉన్న నాని.. విజయ్ కోసం విలన్ గా మారతాడో లేదో చూడాలి.