బ్రేకింగ్ న్యూస్.. కారు యాక్సిడెంట్.. ఏసీపీ ఫ్యామిలీ మెంబర్స్ దుర్మరణం
on Oct 25, 2021
ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ. పేరు కేవీఎం ప్రసాద్. డ్యూటీలో నిత్యం బిజీగా ఉంటారు. సోమవారం ఉదయం సడెన్‌గా ఆయన ఫోన్ రింగ్ అయింది. ఏదో డిపార్ట్‌మెంట్ కాల్ అయి ఉంటుందని చాలా క్యాజువల్‌గా కాల్ లిఫ్ట్ చేశారు. మేటర్ విని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తాను స్వయంగా ఏసీపీ అయి ఉండికూడా.. ఆ న్యూస్ విని నిలువునా కుప్పకూలిపోయారు. కన్నీటి పర్యంత మయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే....
మేడ్చల్ జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లి ఔటర్ రింగ్‌రోడ్డు దగ్గర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏసీపీ కుటుంబ సభ్యులు ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి.
మృతుల్లో ఏసీపీ సతీమణి శంకరమ్మతో పాటు ఆయన సోదరుడి కుమారుడు భాస్కర్ దంపతులు ఉన్నారు. ఏసీపీ సోదరుడు బాలకృష్ణకు గాయాలు అవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఓ వివాహ వేడుకకు హాజరై.. హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాధం నెలకొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



