
నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ కంటే ముందే బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తేజస్విని త్వరలోనే ఒక పవర్‌ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నారట. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కి భిన్నంగా, ఒక మంచి సామాజిక సందేశం ఉన్న లేడీ ఓరియంటెడ్ స్పోర్ట్స్ డ్రామా కథతో ఆమె ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం.
క్రియేటివ్ ఫీల్డ్ లో తేజస్విని కొంతకాలంగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఓటీటీ వేదిక 'ఆహా'లో అఖండ విజయం సాధించిన బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' టాక్ షో వెనుక క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. అలాగే బాలయ్య సినిమాల ప్రొడక్షన్, స్క్రిప్ట్ లు, కాస్ట్యూమ్స్ విషయంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.
అంతేకాదు, ఇటీవల తేజస్విని వేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ వీడియోస్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అలాగే ఒక కమర్షియల్ యాడ్ లో ఆమె స్క్రీన్ ప్రజెన్స్, కాన్ఫిడెన్స్ చూసి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. నటిగా ఎంట్రీ ఇచ్చే క్రమంలో.. ఆడియన్స్ కి చేరువ అవ్వడంలో భాగంగానే తేజస్విని ఈ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే, నందమూరి ఫ్యామిలీ నుంచి వెండితెరపై అడుగుపెడుతున్న తొలి నటిగా తేజస్విని ఒక కొత్త చరిత్ర సృష్టిస్తారు.
Balakrishna Daughter, Tejaswini Nandamuri, Acting Debut






