విజయ్‌తో రొమాన్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన తమన్నా.. ఆ హీరో వల్లేనా?
on Sep 27, 2023
హీరోయిన్‌గా తమన్నాకు ఉన్న పాపులారిటీ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో దాదాపు అందరు టాప్ హీరోలతో సినిమాలు చేసి హీరోయిన్‌గా తన రేంజ్ ఏమిటో చూపించిన తమన్నా బాలీవుడ్ హీరో విజయ్‌వర్మతో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదట. కానీ, ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇప్పటివరకు సందడి చేశారు. అయితే ఇకపై ఆ అవకాశం లేదని తెలుస్తోంది.
విజయ్‌తో తన ప్రేమాయణానికి తమన్నా ఫుల్‌స్టాప్ పెట్టిందని సమాచారం. ప్రస్తుతం ఓ టాప్ హీరోతో ఆమె క్లోజ్‌గా మూవ్ అవుతోందని తెలుస్తోంది. ఈ విషయం విజయ్‌కి తెలిసినప్పటికీ అతను అంతగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదట. ఈ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకున్న విజయ్ ఇది ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయమని ఈజీగా చెప్తున్నాడట. విజయ్‌తో తమన్నా బ్రేకప్, మరో టాప్ హీరోతో రొమాన్స్.. ఈ విషయాల్లో ఎంతవరకు నిజం ఉందో తెలీదుగానీ సోషల్ మీడియాలో మాత్రం దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. నిజానిజాలు ఏమిటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
