'మిషన్ ఇంపాజిబుల్' మూవీలో తాప్సీ!!
on Jun 15, 2021
తెలుగు సినిమా 'ఝుమ్మంది నాదం'తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన తాప్సీ.. ఆ తరువాత బాలీవుడ్ వైపు అడుగులు వేసి హిందీ సినిమాలతో ఫుల్ బిజీ అయిపొయింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. త్వరలో తాప్సీ ఓ తెలుగు మూవీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. 2019 లో విడుదలైన‘గేమ్ ఓవర్’తర్వాత ఆమె నుంచి మరో తెలుగు సినిమా రాలేదు. అయితే ఇప్పుడు తెలుగులో ఒక సినిమా చేయడానికి సిద్ధమైందని సమాచారం.
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే మెప్పించిన దర్శకుడు స్వరూప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా 'మిషన్ ఇంపాజిబుల్' అనే మూవీ చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ మూవీలో.. ఓ ప్రధాన పాత్ర కోసం తాప్సీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె పాత్రకి ఎంతో ప్రాధాన్యముందని, కథ మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంటుందని సమాచారం.
'మిషన్ ఇంపాజిబుల్' మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయిన ఈ సినిమా.. త్వరలో తిరిగి సెట్స్‌పైకి వెళ్లనుంది. హైదరాబాద్ లో త్వరలో జరగనున్న కొత్త షెడ్యూల్ లో తాప్సీ సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.