బన్నీని "ఆ" భయం ఇంకా వెంటాడుతుందా..?
on Feb 19, 2018
.jpg)
నా పేరు సూర్య కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భీకరంగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ అన్న చట్రం నుంచి బయటకు వచ్చి తన కంటూ ఓన్ ఫ్యాన్ బేస్‌ని బిల్డ్ చేసుకోవాలని బన్నీ తాపత్రయపడుతున్నాడు. దానికి తోడు లాస్ట్ మూవీ డీజే విజయం పట్ల ఏమాత్రం సంతృప్తి లేదు.. లెక్కలేనన్ని వివాదాలు.. కలెక్షన్లలో అంకెల గారడీ తప్ప ఏం లేదనే విమర్శలు రావడంతో.. ఈసారి గట్టిగా కొట్టాలని అర్జున్ డిసైడ్ అయ్యాడు.
నా పేరు సూర్య ప్రమోషన్స్‌ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తోన్న బన్నీ.. థియేటర్లలోకి వచ్చే వరకు ఇదే బజ్‌ని కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే బయటికి వచ్చిన టీజర్, రెండు పాటలకు మాంచి రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ పండగ చేసుకుంటోంది. అయితే పవన్ అభిమానులు తనను మరోసారి టార్గెట్ చేస్తారేమోనని కాస్త టెన్షన్ పడుతున్నాడట.. అలాగే కాంట్రవర్సీల జోలికి వెళ్లకూడదని స్ట్రాంగ్‌గా ఫిక్సయ్యాడట. దానికి తోడు టీజర్, పాటల వల్ల ఇది సీరియస్ సినిమాలా ఉందే అన్న ఫీలింగ్ ఆడియన్స్ నుంచి వస్తుండటంతో.. ఇక నుంచి బయటకి వదిలే టీజర్లు, స్టీల్స్‌లో సీరియస్‌నెస్‌ను పక్కనబెట్టి.. ఫ్యామిలీ, రొమాన్స్, లవ్‌ను ఎలివేట్ చేసేలా ప్రమోషన్ చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



