శ్రీమంతుడిలో దేవిశ్రీ మ్యూజిక్ మ్యాజిక్ తగ్గిందా!
on Jul 24, 2015
ఈనెల 18న ప్రిన్స్ మహేశ్ బాబు కొత్త చిత్రం శ్రీమంతుడు ఆడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేక్షకులను తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. దేవిశ్రీ సంగీతం గురించి కొత్తగా చెప్పుకునేదేం లేదు. సగం సినిమాని తన మ్యూజిక్ మ్యాజిక్ తోనే హిట్ చేసేస్తాడు. కానీ ఈసారి శ్రీమంతుడు పాటలు మాత్రం కొంచం స్లోగానే ఉన్నాయన్న టాక్ వినిపిస్తుంది. కొన్నిసార్లు పాటలు స్లోగా ఉన్నా తరువాత తరువాత అభిమానులకు ఎక్కుతాయి.. అలా శ్రీమంతుడు పాటలు కూడా నెమ్మదిగా ఆకట్టుకుంటాయేమో చూడాలి. ఒక్క జాగో పాట మినహా మిగిలిన పాటలు అంత ఆసక్తికరంగా లేవలి అనుకుంటున్నారు. కాగా ఇంతకు ముందు రిలీజైన ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో అభిమానులు సినిమా సూపర్ హిట్టని అనుకుంటున్నారు.