Home

»

Gossips

క్రేజీ రూమర్: స్టార్ క్రికెటర్ ప్రేమలో టాలీవుడ్ క్యూటీ శ్రీలీల!

May 17, 2026

టాలీవుడ్ లో తన డ్యాన్స్ లతో, క్యూట్ లుక్స్ తో కుర్రకారు మనసు దోచుకున్న సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల లవ్ లైఫ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీలో క్రేజ్ పీక్స్ లో ఉన్న హీరోయిన్లపై రూమర్స్ రావడం సహజమే అయినా, ఈ అమ్మడి విషయంలో రోజుకో కొత్త లింక్ వెలుగులోకి రావడం విశేషం. నిన్నటివరకు ముంబై సర్కిల్స్ లో వినిపించిన ఈమె ప్రేమాయణం, ఇప్పుడు పిచ్ పైకి షిఫ్ట్ అయి సరికొత్త రచ్చకు దారితీస్తోంది.

కొంతకాలంగా ఈ కన్నడ కస్తూరి బాలీవుడ్ యంగ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉందంటూ గట్టిగా ప్రచారం సాగింది. వీరిద్దరూ ముంబైలో జరిగిన పలు ఈవెంట్లలో జంటగా సందడి చేయడమే కాకుండా, కార్తీక్ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు శ్రీలీల తన తల్లితో కలిసి వెళ్లడం ఆ రూమర్లకు మరింత ఆజ్యం పోసింది. ప్రస్తుతానికి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక హిందీ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కుతోంది.

అయితే బాలీవుడ్ హీరోతో లవ్ స్టోరీ ముచ్చట సద్దుమణగక ముందే, ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలెంటెడ్ హైదరాబాదీ క్రికెటర్, టీమిండియా యంగ్ స్టార్ తిలక్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందంటూ నెటిజన్లు సరికొత్త కథనాలు అల్లేస్తున్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొన్ని ఆధారాలను కూడా సోషల్ మీడియా వేదికగా తెరపైకి తెస్తున్నారు.

గత ఏడాది వైకుంఠ ఏకాదశి సమయంలో శ్రీలీల ఫ్యామిలీతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడే, తిలక్ వర్మ కూడా తన కుటుంబంతో అక్కడికి రావడం తొలి క్లూగా భావిస్తున్నారు. అంతేకాకుండా, ఐపీఎల్ మ్యాచ్ లలో శ్రీలీల మాతృమూర్తి ముంబై ఇండియన్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కనిపించడం, శ్రీలీల పర్సనల్ స్టాఫ్ లో ఒకరు 'తిలక్' పేరున్న జెర్సీ ధరించడం వంటివన్నీ నెటిజన్ల కంటికి చిక్కాయి.

దీనికి తోడు, ఇటీవల టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఒక సరదా వీడియోలో తిలక్ వర్మను ఉద్దేశించి "నువ్వు ప్రేమలో ఉన్నావు" అని ఆటపట్టించడం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చింది. దీంతో ఆ లవ్ ఇంట్రెస్ట్ మరెవరో కాదు మన టాలీవుడ్ లక్కీ చార్మ్ శ్రీలీలనే అంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు.

మొత్తానికి ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు క్రికెట్ ప్రపంచంలో ఈ క్రేజీ కాంబినేషన్ గురించిన గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ రూమర్స్ పై శ్రీలీల కానీ, అటు తిలక్ వర్మ కానీ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com