తొడల సృష్టి కర్త.. రాఘవేంద్రరావు
on Nov 2, 2015

అలీ మళ్లీ మాట జారాడు. బూతు పురాణం లంకించుకొన్నాడు. `తొడ`లపై సుదీర్ఘమైన సర్వే చేసినట్టు... తెగ మాట్లాడాడు. సైజ్ జీరో ఆడియో వేడుకలో అలీ మాట్లాడిన మాటల్లో వల్గారిటీ కట్టలు తెంచుకొంది. ముఖ్యంగా తొడల గురించి వివరించిన తీరు.. వర్ణణాతీతం. ఈ ఆడియో పంక్షన్లో పాల్గొన్న సోనాల్ చౌహాన్ ని తొడగొట్టమని అడిగింది సుమ. అయితే.. సోనాల్ మీసం మెలేసిందంతే. ఆ తరవాత వేదిక ఎక్కిన అలీ... కి తొడల టాపిక్ దొరికినట్టైంది. ''సోనాల్‌ని తొగగొట్టమన్నావ్. అయితే సోనాల్ కి తొడలు లేవు. అనుష్కకి అయితే బాగా ఉన్నాయి. బిల్లాలో అనుష్క తొడల్ని చూసి పడిపోయాను. రాఘవేంద్రరావు తొడల సృష్టికర్త. ఆయనచూపించని తొడ లేదు..'' అంటూ తొడల గురించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు. అలీ మైకు పట్టుకొంటే ఎన్ని బూతులొస్తాయో మరోసారి సైజ్ జీరో ఆడియో ఫంక్షన్ నిరూపించింది. అనవసరంగా తొడల సంగతి ఎత్తాను భగవంతుడా అంటూ సుమ కూడా సిగ్గుతో చచ్చిపోయింది. అలీ ఎప్పుడు మారతాడో ఏంటో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



