Home

»

Gossips

కార్తి, సామ్.. ఓ బైలింగ్వ‌ల్ మూవీ!?

Jan 31, 2022

`అంజాన్` (తెలుగులో `సికింద‌ర్`), `24` చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ సూర్య‌కి జోడీగా అల‌రించింది స‌మంత‌. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో సూర్య త‌మ్ముడు కార్తికి జంట‌గా క‌నువిందు చేయ‌నుంద‌ట సామ్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. కార్తి క‌థానాయకుడిగా స‌తీశ్ సెల్వ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ బైలింగ్వ‌ల్ మూవీ రూపొంద‌నుంది. తమిళ‌, తెలుగు భాష‌ల్లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో స‌మంత క‌థానాయిక‌గా న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం. క‌థ‌, పాత్ర న‌చ్చ‌డంతో సామ్  ఈ ప్రాజెక్ట్ కి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే కార్తి, సామ్ కాంబో మూవీపై క్లారిటీ రానుంది. మ‌రి.. వెండితెర‌పై కార్తి, సామ్ జోడీ ఏ స్థాయిలో ఎంట‌ర్టైన్ చేస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం కార్తి చేతిలో `పొన్నియ‌న్ సెల్వ‌న్`, `స‌ర్దార్`, `విరుమాన్` చిత్రాలున్నాయి. వీటిలో `పొన్నియ‌న్ సెల్వ‌న్` తాలూకు మొద‌టి భాగం వేస‌విలో సంద‌డి చేయ‌నుంది. ఇక స‌మంత విష‌యానికి వ‌స్తే.. `శాకుంత‌లం`, `య‌శోద‌` వంటి పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ తో పాటు `కాత్తు వాక్కుల రెండు కాద‌ల్` అనే త‌మిళ చిత్రం త‌న‌ ఖాతాలో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా ఇదే ఏడాది తెర‌పైకి రాబోతున్నాయి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com