ఔను... సమంత మంచి కూతురు కాదు..!
on May 9, 2016

మదర్స్ డే సంబరాలు అంబరాన్ని అంటాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ తెరిస్తే చాలు.. అమ్మ రూపమే కనిపించింది. సెలబ్రిటీలు తమ తల్లులతో దిగిన సెల్పీలను పోస్ట్ చేసి అభిమానులతో పంచుకొన్నారు. మై స్వీట్ మమ్మీ... అంటూ అమ్మని కీర్తించారు. అయితే సమంత ట్వీట్ మాత్రం... విభిన్నంగా కనిపించింది. ‘నేను మంచి కూతురుని కాదు, మంచి స్నేహితురాలుని కాదు అన్నింటా మించి తాను మంచి గర్ల్ ఫ్రెండ్ ని కాదు’ అంటూ సమంత ట్వీట్ చేసింది. దాంతో... సమంత అభిమానులు, సన్నిహితులు షాక్ తిన్నారు. సమంత ఏదో ఫస్ట్రేషన్‌లో ఆ మాట అనుంటుందిలే అని కొంతమంది లైట్ తీసుకొన్నా... సమంత అన్నది నిజమే.. అమె మంచి కూతురు కాదు అంటూ కొంంతమంది గుసగుసలాడుకొంటున్నారు. దానికీ ఓ కారణం ఉంది. సమంత గత కొన్నాళ్లుగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటుంది. వాళ్లని అస్సలు పట్టించుకోవడమే లేదట. సమంత ఎక్కడుందో.. అన్న సమాచారం కూడా తల్లిదండ్రులకు తెలీదట. సమంత వ్యక్తిగత విషయాలకూ, ప్రేమ వ్యవహారాలకూ సంబంధించి ఇంట్లో వాళ్లు చాలాసార్లు సమంతతో గొడవ పడ్డారట. తనకు ఇంట్లో ప్రైవసీ లేదని భావించిన సమంత.. ఇంటినుంచి బయటకు వచ్చేసిందని, అస్సలు ఇంట్లోవాళ్లకు టచ్‌లో లేదని తెలుస్తోంది. అందుకే సమంత అలా ట్వీట్ చేసిందని చెప్పుకొంటున్నారు. లోకమంతా అమ్మ గురించి గొప్పగా మాట్లాడుతున్న తరుణంలో.. సమంతకి మదర్ సెంటిమెంట్ గుర్తొచ్చి ఉంటుంది. అందుకే.. అలాంటి కామెంట్లు చేసింది. ట్వీట్లు పెట్టే బదులు గతమంతా మర్చిపోయి అమ్మ దగ్గరకు వెళ్లుంటే బాగుండేది కదా సమంతా..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



