అల్లు అర్జున్ చెల్లెలిగా సాయిపల్లవి?
on Sep 27, 2020
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న, 2021లో రిలీజ్ కానున్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటి 'పుష్ప'. పాన్ ఇండియా ఫిల్మ్‌గా పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా స్టైలిష్ స్టార్ కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమాగా భావిస్తున్నారు. 'కర్ణాటక క్రష్'గా పేరుపొందిన రష్మిక మందన్న ఈ మూవీలో బన్నీ జోడీగా నటిస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీలో బన్నీ చెల్లెలిగా సాయిపల్లవి నటించే అవకాశాలున్నాయి.
ఈ మూవీలో బన్నీ క్యారెక్టర్ పేరు పుష్పరాజ్. అతని చెల్లెలి పాత్రకు సినిమాలో ప్రాధాన్యం ఉంది. అన్నాచెల్లెళ్ల బంధం ఈ సినిమాకు చాలా బలమైన పాయింట్ అని తెలుస్తోంది. స్టెల్లార్ పర్ఫార్మర్గా ఇప్పటికే పేరు తెచ్చుకొని, చేసిన ప్రతి పాత్రలోనూ గొప్పగా రాణించిన సాయిపల్లవి అయితే ఆ క్యారెక్టర్‌కు న్యాయం చేకూరుస్తుందని సుకుమార్ భావిస్తున్నాడనీ, ఇప్పటికే ఆమెను అప్రోచ్ అయ్యాడనీ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఒకవేళ ఆ పాత్ర చేయడానికి సాయిపల్లవి రెడీ అంటే, సినిమాలో ఆమెకూ, రష్మికకు కాంబినేషన్ సీన్స్ ఉంటాయా, ఉంటే అవి ఎలా ఉంటాయోననే ఆసక్తి ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తయారవుతున్న 'పుష్ప'లో బన్నీ ట్రక్ డ్రైవర్‌గా నటిస్తుండగా, అతని ప్రియురాలి పాత్రలో రష్మిక కనిపించనున్నది. మాస్ ఎలిమెంట్స్‌తో, గ్రిప్పింగ్ క్లైమాక్స్‌తో పాటు ట్విస్టులతో ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడుస్తుందని యూనిట్ వర్గాల సమాచారం.
సాయిపల్లవి ప్రస్తుతం 'విరాటపర్వం' చిత్రంలో రానా సరసన నటిస్తోంది. అలాగే నాని సినిమా 'శ్యామ్ సింగ రాయ్'లో ఓ నాయికగా కనిపించనున్నది.
Also Read