Home

»

Gossips

బాల‌య్య ల‌క్కీ డేట్ కి `అఖండ‌`?

Sep 27, 2021 1:11PM

`సింహా` (2010), `లెజెండ్` (2014) వంటి సెన్సేష‌న‌ల్ హిట్స్ త‌రువాత న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ - మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం `అఖండ‌`. `సింహా`, `లెజెండ్` త‌ర‌హాలో ఇందులోనూ బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. అందులో ఒక‌టి.. అఘోరా పాత్ర కావ‌డం విశేషం. కాగా, చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వ‌ర‌లో థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఈ సినిమాని బాల‌య్యకి అచ్చొచ్చిన సీజ‌న్ లో అందునా ఓ ల‌క్కీ డేట్ కి రిలీజ్ చేయాల‌ని యూనిట్ ప్లాన్ చేస్తోంద‌ట‌. పాతికేళ్ళ క్రితం `వంశానికొక్క‌డు` (1996) వంటి సూప‌ర్ హిట్ మూవీ విడుద‌లైన రోజు (జ‌న‌వ‌రి 5)న‌ `అఖండ‌`ని రిలీజ్ చేసే దిశ‌గా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఇప్ప‌టికే జ‌న‌వ‌రి 12న `భీమ్లా నాయ‌క్`, జ‌న‌వ‌రి 13న `స‌ర్కారు వారి పాట‌`, జ‌న‌వ‌రి 14న `రాధేశ్యామ్` లాక్ కావ‌డంతో.. ఆ చిత్రాల కంటే వారం ముందు, సంక్రాంతి సీజ‌న్ లో తొలి చిత్రంగా `అఖండ‌` వ‌చ్చే అవ‌కాశ‌ముందంటున్నారు. త్వ‌ర‌లోనే `అఖండ‌` రిలీజ్ డేట్ క్లారిటీ రానుంది.  మ‌రోవైపు.. ద‌స‌రాకి ఈ సినిమా రాబోతుందంటూ క‌థ‌నాలు వ‌చ్చినా ఎలాంటి అప్ డేట్ లేదు.  చూడాలి మ‌రి.. `అఖండ‌` ఆగ‌మ‌నం ఎప్పుడు ఉంటుందో!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com