యాంకర్ ప్రదీప్ దర్శకుడితో రవితేజ సినిమా!
on Jun 17, 2022
మాస్ మహారాజా రవితేజ ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్ కి అవకాశమిస్తుంటాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా అందులో ఇద్దరు కొత్త దర్శకులు కావడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా రవితేజ మరో యువ దర్శకుడికి అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది.
బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో వెండితెరపై హీరోగానూ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఫణి ప్రదీప్(మున్నా) ఇప్పుడేకంగా రవితేజను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. మున్నా చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన రవితేజ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడని టాక్.
కాగా రవితేజ చేతిలో ప్రస్తుతం 'రామారావు ఆన్ డ్యూటీ', 'ధమాకా', 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదలకు సిద్ధమవుతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
