Home

»

Gossips

శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్: టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకవుతారు.!

Sep 2, 2026 11:58AM

గుజరాతీ సినిమాలు అంటే తక్కువ బడ్జెట్, పరిమిత మార్కెట్ అని అందరూ అనుకుంటారు. కానీ 'లాలో: కృష్ణ సదా సహాయతే' అనే సినిమా ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. శ్రీకృష్ణుడి ఆధ్యాత్మికతకు, సర్వైవల్ డ్రామాను జోడించి తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్ తో తీస్తే.. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి గుజరాతీ చిత్రంగా రికార్డు సృష్టించి, ఏకంగా 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ఇప్పుడు సౌత్ మేకర్స్ పోటీ పడుతున్నారు.

ముఖ్యంగా 'లాలో' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట. అంతేకాదు, ఈ తెలుగు రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్ర కోసం రామ్ చరణ్‌ను సంప్రదించినట్లు ప్రచారం సాగుతోంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిన చరణ్, డివైన్ టచ్ ఉన్న పాత్రలో కనిపిస్తే ఆ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. గతంలో 'గోపాల గోపాల' సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రలో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో బాబాయ్ బాటలోనే అబ్బాయ్ కూడా కృష్ణుడిగా మారి మెగా అభిమానులకు పూనకాలు తెప్పించబోతున్నారా అనే చర్చ మొదలైంది.

అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌కి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే వార్త ఫ్యాన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచేసింది. విభిన్నమైన కథలను తనదైన మార్క్ స్క్రీన్‌ప్లేతో చెప్పే కార్తీక్ సుబ్బరాజ్ హ్యాండిల్ చేస్తే ఈ కాంబో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక సినిమాలో ప్రధాన పాత్ర కోసం నటుడు సత్యదేవ్ పేరు కూడా వినిపిస్తోంది.

అయితే ఇవన్నీ ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయి. మేకర్స్ నుంచి కానీ, రామ్ చరణ్ టీమ్ నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఒక చిన్న బడ్జెట్ డివైన్ హిట్ మూవీ.. చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ వైపు చూడటం నిజంగానే ఆసక్తికరమైన విషయం. ఒకవేళ రామ్ చరణ్ నిజంగానే కృష్ణుడిగా కనిపిస్తే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

 

 

 

[Ram Charan as Krishna, Laalo Remake Telugu, Laalo Krishna Sada Sahayate, Ram Charan, Karthik Subbaraj, Pawan Kalyan, Gopala Gopala, Telugu Film News, Telugu News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com