Home

»

Gossips

రజినీకాంత్, ధనుష్ ల కొత్త పార్టీ: అధ్యక్షుడు, సెక్రటరీ ఎవరంటే!

Oct 7, 2026 10:44AM


సినీ రంగానికి ఉన్న అరుదైన ప్రత్యేకత ఏంటంటే పెళ్లి అయిన తర్వాత పిల్లలు ఉండి విడిపోయినా కూడా చాలా హుందాగా విడిపోతారు. అంతే కానీ కుటుంబ పరంగా  ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం అనేది జరగదు. పైగా టన్నుల కొద్దీ ఉన్న అభిమానం మాత్రం ఇంచు కూడా తగ్గదు. ఈ కోవలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడి హోదా నుంచి ధనుష్ విరమించుకున్నా ఆ ఇద్దరి మధ్య అభిమానం మాత్రం పోలేదనేది తమిళ సినీ సర్కిల్స్ లో ఎప్పుడు వికసిస్తూ తిరిగే మాట. 

ఇక తమిళనాడుకి, రాజకీయాలకి ఉన్న సంబంధం తెలిసిందే. దాదాపుగా దశాబ్దాల తరబడి నుంచి తమిళ రాజకీయాలని శాసిస్తుంది సినిమా వాళ్లే. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, పొలిటికల్ కారిడార్లలో ఒక సరికొత్త సంచలనాత్మక ప్రచారం శరవేగంగా వైరల్ అవుతోంది.  రజనీకాంత్, ధనుష్ కలిసి ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారనే వార్తలు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ వార్తల వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటి, అసలు ఈ రూమర్లు ఎందుకు పుట్టుకొచ్చాయో లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి.ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలల్లో దళపతి   విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఊహించని విజయాన్ని సాధించడంతో, కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్ హీరోల పొలిటికల్ ఎంట్రీపై చర్చలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే ధనుష్ భారత ఎన్నికల సంఘం వద్ద 'తమిళగ ఎళుచ్చి కళగం' అనే పేరుతో ఒక నూతన రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయించారని, దానికి రజనీకాంత్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తే, ధనుష్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపడతారనే ఊహాగానాలు షికారు చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా ధనుష్ తన అభిమాన సంఘాలను సామాజిక సేవా కార్యక్రమాల వైపు నడిపించడం, ఫ్యాన్ క్లబ్స్ కోసం ప్రత్యేకంగా ఒక నూతన పతాకాన్ని ఆవిష్కరించడం వంటి పరిణామాలు ఈ పొలిటికల్ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చాయి.   


అంతేకాకుండా, గతంలో రజనీకాంత్ 'రజని మక్కల్ మన్రం' పేరుతో తన అభిమాన సంఘాలను బలోపేతం చేసి, దాదాపు 234 నియోజకవర్గాల్లో కార్యకర్తల నెట్‌వర్క్‌ను సిద్ధం చేసినప్పటికీ, ఆరోగ్య కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాల నుంచి వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ విస్తృతమైన అభిమాన బలాన్ని, ధనుష్ యంగ్ ఫ్యాన్ బేస్‌ను ఏకం చేస్తూ 100% పక్కా ప్రణాళికతో వీరు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటూ నెట్టింట కథనాలు ఊపందుకున్నాయి. కొంతమంది విశ్లేషకులు ఒకడుగు ముందుకు వేసి, వచ్చే ఎన్నికల్లో వీరు మరో 2 లేదా 3 కీలక ప్రాంతీయ శక్తులతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటూ లెక్కలు కట్టడం కూడా మొదలుపెట్టారు.అయితే, ఈ వైరల్ రూమర్లలో ఎంతవరకు నిజముందనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. రజనీకాంత్, ధనుష్ ప్రతినిధుల నుంచి కానీ, లేదా ఇరు కుటుంబాల నుంచి కానీ ఈ ఉమ్మడి రాజకీయ ప్రవేశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ధనుష్ తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కేవలం సామాజిక కోణంలోనే విస్తరిస్తున్నారని, దానికి రాజకీయ రంగు పూయడం తొందరపాటే అవుతుందని ఆయన సన్నిహిత వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

 

 

రజనీ ఇదివరకే పొలిటికల్ చాప్టర్‌కు శుభం కార్డ్ వేశానని స్పష్టం చేసినందున, మళ్లీ కొత్త పార్టీ అధ్యక్షుడిగా వస్తారనడంలో వాస్తవం లేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా, అధికారిక స్పష్టత వచ్చే వరకు  రజనీ, ధనుష్ కాంబినేషన్ వార్తలు నెటిజన్లకు, అభిమానులకు కావాల్సినంత సినీ హాట్ టాపిక్‌.

 

 

[Rajinikanth And Dhanush Political Party Rumors, Rajinikanth Dhanush Political Party, Dhanush New Party Rumors, Tamilaga Ezhuchi Kazhagam, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com