Home

»

Gossips

'VD12' కోసం పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్!

Feb 01, 2025

 

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా 'VD12' (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్ కి మంచి స్పందన లభించింది. ఇక ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ లాక్ అయింది. అంతేకాదు ఈ టైటిల్.. బిగ్ సర్ ప్రైజ్ తో రివీల్ కాబోతుందని తెలుస్తోంది.

 

'VD12' చిత్రానికి 'కింగ్ డమ్' లేదా 'ఎంపీరియమ్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 7న టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ రోజున టైటిల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇంకో విశేషం ఏంటంటే, ఈ టైటిల్ టీజర్ కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించనున్నారని వినికిడి. (Pawan Kalyan)

 

'VD12' టైటిల్ టీజర్.. స్టార్ హీరో వాయిస్ ఓవర్ తో ఉంటుందని మొదటి నుంచి వినిపించిన మాట. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, వెంకటేష్ వంటి స్టార్స్ లో ఎవరో ఒకరు వాయిస్ ఓవర్ అందించే అవకాశముందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది.

 

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ తో పవన్ కి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగవంశీ రిక్వెస్ట్ తో 'VD12' టైటిల్ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పవన్ అంగీకరించినట్లు సమాచారం. అదే నిజమైతే 'VD12'పై ఒక్కసారిగా బజ్ రెట్టింపు కావడంతో పాటు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతారని చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఉపముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ టైంలో ఒక సినిమా కోసం పవన్ వాయిస్ ఓవర్ ఇస్తే.. అది ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుందని చెప్పవచ్చు. కాగా, గతంలో చిరంజీవి హీరోగా నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాకి పవన్ వాయిస్ ఓవర్ అందించారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com