పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ కాంబోలో భారీ మల్టీస్టారర్!
on Feb 9, 2026

మరో మల్టీస్టారర్ చేస్తున్న పవన్ కళ్యాణ్!
పవన్ సోదరుడి పాత్రలో విజయ్ దేవరకొండ!
మల్టీస్టారర్స్ ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ముఖ్యంగా ఊహించని కాంబినేషన్ లో మల్టీస్టారర్ వస్తే ఆ కిక్కే వేరు. త్వరలో అలాంటి ఓ మల్టీస్టారర్ కి శ్రీకారం పడబోతున్నట్లు తెలుస్తోంది. ఒక క్రేజీ ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) చేతులు కలుపుతున్నట్లు సమాచారం.
ఈ మార్చి 26న 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ప్రేక్షకులను పలకరించనున్న పవన్ కళ్యాణ్.. తన తదుపరి సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నారని వినికిడి. అయితే ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు రెండో హీరోగా విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తోంది.
ఈ సినిమాలో పవన్, విజయ్ అన్నదమ్ములుగా కనిపిస్తారట. విజయ్ ది సినిమా అంతా ఉండే పాత్ర కాగా.. పవన్ మాత్రం ఇంటర్వెల్ కి ముందు వచ్చి, దాదాపు గంటసేపు స్క్రీన్ పై కనిపిస్తారని టాక్. అదే నిజమైతే పవన్-విజయ్ కాంబో ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది అనడంలో డౌట్ లేదు.
పవన్ కళ్యాణ్ కి మల్టీస్టారర్స్ కొత్తకాదు. గోపాల గోపాల, బ్రో వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు తన పొలిటికల్ కమిట్ మెంట్స్ కారణంగా.. తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో మరో మల్టీస్టారర్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఉగాదికి ఈ మూవీని లాంచ్ చేసి, వెంటనే షూట్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. 2027 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.
Also Read: టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ బాక్సాఫీస్ ఫైట్.. ఎన్నిసార్లు తలపడ్డారు? ఎవరిది పైచేయి?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



