Home

»

Gossips

అఖిల్ కోసం వస్తున్న పవన్ కళ్యాణ్..!!

Sep 4, 2015 5:40PM

అఖిల్ ఫస్ట్ మూవీ 'అఖిల్' ఆడియో ఫంక్షన్ ను లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు జయంతి(సెప్టెంబర్ 20) రోజు విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు హీరో, నిర్మాత నితిన్. ఈ ఆడియోను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన నితిన్, ఈ ఆడియో రిలీజ్ కు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారట. పవర్ స్టార్ కూడా ఈవెంట్ కు వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఇప్పటికే అఖిల్ టీజర్ ను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా రిలీజ్ చేయించిన హీరో నాగార్జున... నితిన్ ప్రపోజల్ కు ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే మెగా హీరోల ఆడియో ఫంక్షన్లకు డుమ్మా కొడుతున్న పవన్ కళ్యాణ్ అక్కినేని ఆడియో ఫంక్షన్ కి హాజరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా అఖిల్ ఆడియో పవన్ కళ్యాణ్ హాజరైతే ఈ సినిమాకి మరింత క్రేజ్ రావడం ఖాయం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com