కొరటాల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ.. మరోసారి స్టూడెంట్ లీడర్ గా!
on Aug 5, 2021
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమాలో స్టూడెంట్ లీడర్ గా కనిపించాడు. సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. స్టూడెంట్ లీడర్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్ మరోసారి స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని టాక్ వినిపిస్తోంది.
కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నాడు. అనంతరం విజయ్ తో ఒక సినిమా చేయడానికి కొరటాల ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కొరటాల ఓ సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు అదే స్టొరీతో విజయ్ హీరోగా సినిమా చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.
విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్, శివ నిర్వాణ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి తర్వాత కొరటాల ప్రాజెక్ట్ ఉండే అవకాశముందని అంటున్నారు.