Home

»

Gossips

హీరోగా కేటీఆర్ కుమారుడు: సినీ ఎంట్రీ ఇస్తున్న కల్వకుంట్ల హిమాన్షు.!

Aug 12, 2026 11:24AM

మనం సాధారణంగా పొలిటిషియన్స్ పిల్లలను చూస్తే.. తండ్రి బాటలోనే రాజకీయం చేస్తారని లేదా సొంతంగా ఏవైనా బిజినెస్ లు చూసుకుంటారని అనుకుంటాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ, టాలీవుడ్ సర్కిల్స్ లోనూ ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది.

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, మాజీ సీఎం కేసీఆర్ మనవడు అయిన కల్వకుంట్ల హిమాన్షు.. త్వరలోనే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. కల్వకుంట్ల కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా హిమాన్షు ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ, అనూహ్యంగా ఆయన రాజకీయాల్లోకి కాకుండా.. వెండితెరపై మెరవడానికి రెడీ అవుతున్నారనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హిమాన్షు డెబ్యూ చాలా గ్రాండ్ గా ఉండబోతోందట. దీని కోసం టాలీవుడ్ లోని ఒక ప్రముఖ నిర్మాత, పవర్ ఫుల్ డైరెక్టర్ తో ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. 

ఇటీవల హిమాన్షు అద్భుతమైన మేకోవర్ తో ఫిట్ గా, పక్కా "హీరో మెటీరియల్"లా కనిపిస్తున్నారు. తన లుక్స్ పై, ఫిజిక్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం చూస్తుంటే.. ఈ సినీ ఎంట్రీ వార్తలు కేవలం పుకార్లు మాత్రమే కావు, దీని వెనుక పెద్ద ప్లానింగే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

 

 

KCR Grandson, KTR Son, Kalvakuntla Himanshu, Hero Entry, Telangana

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com